చదువు సంధ్య లేని వారన్న మాటలు నేను పట్టించుకోను - నారా లోకేష్

చదువు సంధ్యా లేని వారి మాటలు విని, ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకొని వుంటారు. మీరూ వినండి అందులో లోకేష్ గారు గురించి ఇచ్చిన  సమాధానాలు మా పిల్లలు బయట దెబ్బలు గాని లేదా తిట్లు గాని, తిని వచ్చి, నాకు చెప్పినా, నేను కలగజేసుకొని ఎవరినీ అడిగింది లేదు. అందుకని నా దగ్గరకు వచ్చి, ఎవరిమీదా చాడీలు చెప్పరు. పాలసీ ఏమంటే వారి బతుకులో, పడి లేచి, దెబ్బలు తిని నేర్చుకొంటే,  సమాజంలో రేపు వారు ఎలా మెలగాలో తెలిసి వస్తుంది అని.నాలా, లోకేష్ ని ఎవరు తిడుతున్నా, ఎలా తిడుతున్నా, వాళ్ల నాన్న పట్టించుకోకపోవడం గమనించా. చాలా సార్లు ఏమన్నా సపోర్ట్ గా మాట్లాడుతారేమో అని చూసినా, ఊహూ.

తెలుగులో పొరబాటున మాటలుజారి ట్రోల్ అయ్యాడు. దానికి తోడు వ్యక్తిత్వ హననానికి గురయ్యాడు. కాని లోకేష్ కూడా ఎప్పుడూ ఆ చదువు సంధ్యా లేని వారి మాటలకు, తిరిగి సమాధానం చెప్పింది చూడలేదు.

ఓ సారి రెండు ప్రశ్నలు అడిగే అవకాశం వచ్చింది. ఓపికగా పావుగంటకు పైగా వివరించారు. ఆయన రెండు శాఖల పని తీరు మీద వున్న అవగాహనకు, కొంత ఆశ్చర్యం వేసింది. బయట వినేదానికి, ఆయన లోపల వున్న విషయానికి, చాలా తేడా వుంది అని అనిపించింది.

అప్పటి నుండి కొంత గమనిస్తూ వున్నా. వాళ్ల డాడీ దావోస్ కి కూడా పంపారు అని, అందరూ అనుకొన్నారు. అక్కడి మైనస్ డిగ్రీల టెంపరేచర్ కన్నా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో లోకేష్ అజైల్ డాటా గవర్నెన్స్ లో మెంబర్ అని చూసి, మరి కొంత ఆసక్తి కలిగింది. కొన్ని రోజుల పాటు మన మీడియాలలో చూసా, ఏమన్నా అక్కడ మాట్లాడింది చూపిస్తారా అని. మన నేషనల్ మీడియా తీసుకొన్న ఓ ఇంటర్వూ మాత్రం కనిపించింది.సర్లే దాందేముంది. మన ఊరు పంచాయితీ కాదు, నాన్న వుండే అసెంబ్లీ కాదు, ప్రపంచ ఆర్థిక సదస్సులో గవర్నింగ్ డాటా ఇన్ అవర్ డైలీ లైవ్స్ అనే టాపిక్ లో, లోకేష్ కూడా చర్చలో వున్నాడని, కొన్ని ట్వీట్స్ ద్వారా తెలుసుకొని, మరి కొంత కుతూహలంతో, ఆ ప్రసంగాల కోసం వెతికితే, ఎట్టకేలకు దొరికాయి.


చదువు సంధ్యా లేని వారి మాటలు విని, ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకొని వుంటారు. మీరూ వినండి అందులో లోకేష్ గారు ఇచ్చిన సమాధానాలు.  మన ఆంధ్రా గురించి గొప్పగా మార్కెటింగ్ చేసాడనిపించింది. 

రేంజి పెరిగి, లోకేష్ ని ఈ మధ్య, మోడీ గారు అనవసరంగా తిట్టినా, వాళ్ల డాడీ అదే సైలెన్స్, నాలా

Post a Comment

0 Comments